తమ ప్రభుత్వంలో.మెరుగ్గా పెన్షన్లు.ఇస్తున్నాం. అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు
సత్యసాయి జిల్లా, , 1 నవంబర్ (హి.స.) తమ ప్రభుత్వంలో మెరుగ్గాపెన్షన్లను పంపిణీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు()ఉద్ఘాటించారు. ఒక్క పెన్షన్ ఇవ్వడానికే 2.65 లక్షల మంది వలంటీర్లను గత ప్రభుత్వంలో పెట్టారని విమర్శించ
తమ ప్రభుత్వంలో.మెరుగ్గా పెన్షన్లు.ఇస్తున్నాం. అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు


సత్యసాయి జిల్లా, , 1 నవంబర్ (హి.స.)

తమ ప్రభుత్వంలో మెరుగ్గాపెన్షన్లను పంపిణీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు()ఉద్ఘాటించారు. ఒక్క పెన్షన్ ఇవ్వడానికే 2.65 లక్షల మంది వలంటీర్లను గత ప్రభుత్వంలో పెట్టారని విమర్శించారు. దానికంటే మెరుగ్గా ఇప్పుడు మూడు గంటల్లోనే పెన్షన్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం పెద్దపీట వేయటంతో పాటు సుపరిపాలన ద్వారా ఏపీని పునర్నిర్మాణం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటుతో కూటమిని గెలిపించి అధికారం అప్పగించారని ఉద్ఘాటించారు. అందుకే నిత్యం ప్రజల గురించే తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande