బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బాపు ఘాట్ వద్ద ప్రార్ధనలు..
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.) బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఇవాళ రాష్ట్ర బీసీ కమిషన్ ఆధ్వర్యంలో బాపూ ఘాట్ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. లంగర్ హౌస్ లోని బాపూ ఘాట్ వద్ద ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు గాంధీజీ భజనలతో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో తె
బీసీ రిజర్వేషన్


హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.)

బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఇవాళ రాష్ట్ర బీసీ కమిషన్ ఆధ్వర్యంలో బాపూ ఘాట్ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. లంగర్ హౌస్ లోని బాపూ ఘాట్ వద్ద ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు గాంధీజీ భజనలతో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బి సి కమిషన్ చైర్మన్ నిరంజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, వీహెచ్, జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande