
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.)
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మర్శించారు. ఎన్నికల సందర్భంగా అభయహస్తం పేరుతో మేనిఫెస్టోను ప్రకటించిందని అది అభయస్తం కాదు భస్మాసుర హస్తం అని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 23 నెలల పాలనపై 'బూటకపు హామీలు మోసపూరిత వాగ్ధానాలు' పేరుతో ఇవాళ బీజేపీ చార్జిషీట్ విడుదల చేసింది. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు ఈ చార్జిషీట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. కేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బులను కక్కించి కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు చేస్తామని రాహుల్ గాంధీతో చెప్పించారని మరి కేసీఆర్ కుటుంబం వద్ద ఎన్ని కోట్లు కక్కించారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..