
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.)
ఇటీవల స్కూళ్లు, కాలేజీలు, ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు రావడం సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పరిధిలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జెడ్డా నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానంలో ఉందంటూ ఆగంతకులు ఎయిర్పోర్టు అధికారులకు మెయిల్ పంపారు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన ఇండిగో విమానాన్ని హుటాహుటిన ముంబై ఎయిర్పోర్ట్కు దారి మళ్లించారు. ఎయిర్పోర్టు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..