
అమరావతి, 1 నవంబర్ (హి.స.)కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందించారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ