మొబైల్కు వచ్చిన లింక్.. ఓపెన్ చేయగానే రూ.9, 90,000 మాయం!
ఖమ్మం, 1 నవంబర్ (హి.స.) ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఒక వ్యాపారి సెల్ ఫోన్ కి నిన్న శుక్రవారం రోజున ఒక లింక్ రావడంతో దాన్ని ఓపెన్ చేశారు. అంతే.. తన అకౌంట్ నుంచి 4:15 నుంచి 4:45 గంటల లోపల దఫదఫాలుగా రూ.9,90,000 డ్రా చేసినట్లు మెసేజ్లు కంటిన్యూషన్ గా
సైబర్ నేరం


ఖమ్మం, 1 నవంబర్ (హి.స.)

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఒక వ్యాపారి సెల్ ఫోన్ కి నిన్న శుక్రవారం రోజున ఒక లింక్ రావడంతో దాన్ని ఓపెన్ చేశారు. అంతే.. తన అకౌంట్ నుంచి 4:15 నుంచి 4:45 గంటల లోపల దఫదఫాలుగా రూ.9,90,000 డ్రా చేసినట్లు మెసేజ్లు కంటిన్యూషన్ గా వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన సదరు వ్యాపారి బ్యాంకు దగ్గరికి వెళ్లి బ్యాంకు సిబ్బందికి విషయం తెలియజేసి తన అకౌంట్ ను నిలుపుదల చేశారు. అనంతరం స్థానిక మధిర టౌన్ పోలీసులను ఆశ్రయించగా సైబర్ నేరగాళ్ల పని అని ధ్రువీకరించి, సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా సూచించారు. దీంతో బాధిత వ్యాపారి శనివారం ఖమ్మం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్టు సమాచారం. కనుక ఫోన్లకు వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande