
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.) టీమిండియా మహిళల జట్టుకు
అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar). రేపు ఆదివారం జరగబోయే వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా గెలిచి ఛాంపియన్ అయితే.. పాట పాడుతానని కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల కిందట సెమీ ఫైనల్ లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా గెలిచి, ఫైనల్ కు దూసుకువెళ్ళింది.
ఫైనల్ మ్యాచ్ ఆదివారం అంటే నవంబర్ రెండవ తేదీన దక్షిణాఫ్రికాతో జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే, ఛాంపియన్ గా మారనుంది టీమిండియా. అయితే ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ కీలక ప్రకటన చేశారు. ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి, టీమిండియా ఛాంపియన్ కావాలన్నారు. అలా జరిగితే జెమీమా రోడ్రిగ్స్ తో ( Jemimah Rodrigues ) పాట పాడుతానని ఆయన ప్రకటించారు. దీంతో సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా, సెమీస్ అద్భుతంగా రాణించిన జెమియా, టీమిండియాను ఫైనల్ కు తీసుకెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..