బీసీ హాస్టల్ ఘటనపై ఎమ్మెల్యే ఆగ్రహం.. విచారణకు ఆదేశం
జోగులాంబ గద్వాల, 1 నవంబర్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మారం బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్లో ఆహారం విషతు
గద్వాల ఎమ్మెల్యే


జోగులాంబ గద్వాల, 1 నవంబర్ (హి.స.)

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి

మండలం ధర్మారం బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్లో ఆహారం విషతుల్యం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆయన ధృవీకరించారు. తక్షణ చర్యలతో ప్రమాదం తప్పింది.

ఘటన గురించి తెలుసుకున్న వెంటనే హాస్టల్ సిబ్బంది సరైన సమయంలో స్పందించి, విద్యార్థులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రిలోని డాక్టర్లు రాత్రి 11:30 గంటల ప్రాంతంలో సుమారు 25 నుంచి 30 మంది వరకు ఉన్నా, కంటిన్యూగా నైట్ అంతా చికిత్స అందించి, విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడగలిగారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande