
ముంబై, 1 నవంబర్ (హి.స.)గత 10 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరల తగ్గుదల శుక్రవారం నుంచి కాస్త బ్రేకులు పడ్డాయ. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,23,290 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,010 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఇక శుక్రవారం ఉదయం 6:30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ (సుమారు 28.34 గ్రాములు) కు $4030.80 (సుమారు రూ. 357,575 ) గా నమోదైంది. ఇది $14.90 పెరిగింది. అయితే, వెండి 0.01% స్వల్పంగా తగ్గింది. వెండి ఔన్స్ కు $48.61 (సుమారు రూ. 4,313 ) వద్ద ట్రేడవుతోంది. అయితే తాజాగా శనివారం నవంబర్ 1న కూడా పెరిగిన ధరలతోనే కొనసాగుతున్నాయి.
శనివారం ధరల వివరాలు:
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,440 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,160 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,290 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,010 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,990 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,290 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,010 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,290 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,010 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV