ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకింగ్ న్యూస్
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.) మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై వారంలో అన్నిరోజులూ ఉదయం 6 గంటల నుంచే మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని, రాత్రి 11 గంటల వరకూ అన్ని టెర్మినల్స్ లో రైళ్లు అందుబాటులో ఉంటాయని పే
హైదరాబాద్ మెట్రో


హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.)

మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై వారంలో అన్నిరోజులూ ఉదయం 6 గంటల నుంచే మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని, రాత్రి 11 గంటల వరకూ అన్ని టెర్మినల్స్ లో రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసింది. నవంబర్ 3వ తేదీ నుంచి ఈ ప్రయాణవేళలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇప్పటి వరకూ సోమవారం నుంచి శుక్రవారం మెట్రో రైళ్లు ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యేవి. లాస్ట్ మెట్రో రైలు 11.45కి ఉండేది. ఈ సౌకర్యం అర్థరాత్రి వరకూ పనిచేసే ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడింది. ముఖ్యంగా ఉమెన్ ఎంప్లాయిస్ సేఫ్ గమ్యస్థానాలకు చేరారు. శనివారం ఫస్ట్ మెట్రో ఉదయం 6 గంటలకు, లాస్ట్ మెట్రో 11 గంటలకు ఉండేది. ఆదివారం ఉదయం 7 గంటలకు ఫస్ట్ మెట్రో, 11 గంటలకు లాస్ట్ మెట్రో ఉండేది. తమ

కానీ నవంబర్ 3వ తేదీ నుంచి అన్ని రోజుల్లోనూ ఉదయం 6 గంటలకు మెట్రో ప్రారంభమవనుండగా.. ఆఖరి మెట్రో 11 గంటలకు ఉండనుంది. దీనివల్ల అర్థరాత్రి వరకూ ఆఫీసుల్లో పనిచేసి, మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణకష్టాలు తప్పేలా లేవు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande