పోలీసు విధుల్లో నిర్లక్ష్యం.. వారంలో ఇద్దరు సస్పెన్షన్! సిపి సజ్జనార్
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.) హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మార్క్ పోలీసింగ్ కనబడుతుంది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించనని బాధ్యతలు చేపట్టిన రోజు స్పష్టం చేసిన సీపీ వారంలోనే ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేశారు. ప్రజలకు అందాల్సిన పో
సజనార్


హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.) హైదరాబాద్ పోలీస్ కమిషనర్

సజ్జనార్ మార్క్ పోలీసింగ్ కనబడుతుంది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించనని బాధ్యతలు చేపట్టిన రోజు స్పష్టం చేసిన సీపీ వారంలోనే ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేశారు. ప్రజలకు అందాల్సిన పోలీసుల సేవలు, నేరాల నియంత్రణ లో పోలీసులు చేపట్టాల్సిన విధుల్లో పోలీసు అధికారుల అలసత్వం ఉండొద్దని సీపీ మొదటి రోజు నుంచి పేర్కొంటున్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సెంట్రల్ జోన్ ఎస్ఐ డి. శ్రీకాంత్ గౌడ్, టప్పాచ్చాబుత్ర ఇన్ స్పెక్టర్ అభిలాష్ ను విధి నిర్వహణలో వ్యవహరించిన తీరు పై సమగ్ర నివేదిక అందుకున్న అనంతరం సీపీ వారిని సస్పెండ్ చేశారు. ప్రజా సంక్షేమ పోలీసింగ్ పై ఫోకస్ పెట్టడంతో పటిష్టమైన శాంతి భద్రతలను అందించే క్రమంలో పోలీసు డ్యూటీలో నిర్లక్ష్యం ను సహించడం లేదని స్పష్టమవుతుంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande