
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.)
ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణంపై హైడ్రా అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్, రాయదుర్గం దర్గా షావలిలో కబ్జాలకు గురవుతున్న రెండు విలువైన స్థలాలను కాపాడారు. హైడ్రా అధికారులు. దర్గా షావలిలో కోట్లాది రూపాయల విలువైన స్థలం కబ్జాలకు గురవుతుందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం ఉదయం దర్గా షావలి సర్వే నెంబర్ 15 ఓల్డ్ సర్వే నెంబర్ (28)లోని ఎకరం స్థలంలోని కబ్జాలను తొలగించారు. అలాగే ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రాను స్థానికులు అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు