
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.)
రాజ్యాంగ సవరణ చేసి,ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎలా ఇచ్చారో బీసీలకు 42 శాతం బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణంలో బీసీ రిజర్వేషన్లు ఒక కీలక అడుగు అని ఆయన అన్నారు. తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై సదస్సు టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు అధ్యక్షతన శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్ర మూర్తి, ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తాను సామాజిక సృహ కలిగిన వ్యక్తినని, తాను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదని అన్నారు. రాజ్యాంగం పట్ల అవగాహన, సమాజంలో ఉన్న పరిస్థితులపై అవగాహన చేసుకొని మాట్లాడే వారు ఎవరినైనా స్వాగతించాలని అన్నారు.
దేశంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సామాజిక న్యాయం కోసం ప్రజా ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. రిజర్వేషన్లు అంటే ఉద్యోగాలు, అవకాశాలు కోసం అనేది అపోహ అని అన్నారు. అప్పుడు లేని ప్రస్తావన, ఇప్పుడు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి పెట్టడం హాస్యాస్పదం అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు