
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చిన కాంగ్రెస్.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ప్రజల మెడలో గొలుసులు కూడా లాక్కుంటోందని సెటైర్లు వేశారు. అటు.. ఫ్రీ బస్ పేరుతో భార్య డబ్బులను కూడా భర్త నుంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలనే బెదిరించే స్థాయికి రేవంత్ రెడ్డి చేరుకున్నారని కేటీఆర్ ఫైరయ్యారు ఎన్నికలు వస్తే ఎవరైనా ఏం చేస్తారో చెప్తారు.. కానీ రేవంత్ బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకపోగా.. అన్ని బంద్ చేస్తామంటూ ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు