
ఖమ్మం, 1 నవంబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని హనుమాన్ కాలనీ ముస్లిం కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం పర్యటించారు.ఈ మేరకు ఆయా కాలనీలలో వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించి శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని మున్సిపాలిటీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన సైడ్ కాలువల నిర్మాణం సీసీ రోడ్లు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, రెండు దశల్లో కాలనీవాసుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..