
మహబూబాబాద్, 1 నవంబర్ (హి.స.)
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పట్టణంలోని (కేజీబీవీ) కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జిల్లా, ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లల అభ్యసన సామర్థ్యాలు, తరగతి గదులు, కిచెన్ షెడ్డు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, పరిసరాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదిలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల యొక్క అభ్యసన సామర్ధ్యాలు ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాల వివరాలను స్వయంగా పిల్లలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం విద్యాశాఖ బలోపేతానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యాబోధనలు అందించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ తరగతి గదులు, తదితర సాధనాల ద్వారా ప్రతి సబ్జెక్టు పై పట్టు సాధించేందుకు విద్యార్థి యొక్క సామర్థ్యాలను వెలికి తీయడం కోసం అనేక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, ఉపాధ్యాయులు వారి యొక్క మేధస్సును వెలికితీయడానికి కృషి చేయాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు