బొలెరో వాహనం బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
మహబూబాబాద్, 1 నవంబర్ (హి.స.) అతి వేగం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఓ శుభ కార్యంలో క్యాటరింగ్ చేసేందుకు ఉదయాన్నే బొలేరో వాహనం లో 25 మంది యువకులు బయలుదేరగా మూలమలుపు వద్ద అతివేగంతో బొలేరో అదుపుతప్పి బోల్తా కొట్టింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం
యాక్సిడెంట్


మహబూబాబాద్, 1 నవంబర్ (హి.స.)

అతి వేగం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఓ శుభ కార్యంలో క్యాటరింగ్ చేసేందుకు ఉదయాన్నే బొలేరో వాహనం లో 25 మంది యువకులు బయలుదేరగా మూలమలుపు వద్ద అతివేగంతో బొలేరో అదుపుతప్పి బోల్తా కొట్టింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బురహాన్ పురం గ్రామ శివారులో జాతీయ రహదారి 365 పై శనివారం జరిగింది. మరిపెడ మండలం లచ్చ తండా, సీరోల్ మండలం కు చెందిన 25 మంది యువకులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ శుభకార్యంలో క్యాటరింగ్ పని చేసేందుకు బొలేరోలో బయల్దేరారు. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారి 365 పై బొలేరో అతి వేగంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మాలోతు పవన్(20) మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande