
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.)
తనను దేశద్రోహి అంటూ కేంద్ర
మంత్రి కిషన్ రెడ్డి చేసి వ్యాఖ్యలపై మంత్రి అజారుద్దీన్ సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించిన అజారుద్దీన్ శనివారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. ఇవాళ ఓన్యూస్ చానల్ తో మాట్లాడిన అజారుద్దీన్.. నాపై వచ్చిన ఆరోపణలపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన నేను దేశ ద్రోహినా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే బీజేపీ నన్ను టార్గెట్ చేసిందని దుయ్యబట్టారు. కిషన్ రెడ్డికి క్రికెట్ గురించి ఏం తెలుసు? కిషన్ రెడ్డికి కనీసం క్రికెట్ బ్యాట్ అయినా పట్టుకోవడం వచ్చా అని విమర్శించారు. మాట్లాడటానికి ఏమి లేక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఆర్నెళ్లలోపు అజారుద్దీన్ ఎమ్మెల్సీ కాలేరని ఆయన మంత్రి పదవి కేవలం ఆరు నెలల పాటే అంటూ వస్తున్న విమర్శలపై స్పందిస్తూ అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు