మీ ఇష్టమున్నప్పుడు ఆఫీస్కు వస్తారా? ఉద్యోగులపై మంత్రి తుమ్మల ఆగ్రహం
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.) సమయ పాలన పాటించని అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం తెలంగాణ అగ్రో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి తుమ్మల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆఫీస్ డ్యూటీ ట
మంత్రి తుమ్మల


హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.)

సమయ పాలన పాటించని

అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం తెలంగాణ అగ్రో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి తుమ్మల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆఫీస్ డ్యూటీ టైమ్ అయినా కొంత మంది సిబ్బంది రాకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో హాజరు సేకరణ విషయంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరకరం గమనిస్తూ హాజరు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా సేకరిస్తున్నారా లేక ఫింగర్ ప్రింట్ ద్వారా సేకరిస్తున్నారా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. భవనాల నిర్వహణ సరిగా లేకపోవడంపై మంత్రి తుమ్మల అసహనం వ్యక్తం చేశారు. కాగా తన శాఖలోని వివిధ కార్యాలయాలను మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో హైదరాబాద్ లోని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని, అగ్రి కమిషనరేట్ను ఆకస్మిక తనిఖీ చేసి సమయపాలన పాటించని అధికారులకు మెమోలు సైతం ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించించిన సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande