
నాగర్ కర్నూల్,1 నవంబర్ (హి.స.)
మొంథా తుపాను ప్రభావంతో నాగర్ కర్నూల్ జిల్లాలో సంభవించిన నష్టాలను వెంటనే శాఖల వారీగా సేకరించి సమర్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయం ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వివిధ శాఖల జిల్లా అధికారులతో తుఫాన్ నష్టాల సేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు అదనపు కలెక్టర్లు. మండలాల వారీగా నష్టాల వివరాలు వెంటనే పంపాలని సూచించారు. తాత్కాలిక పునరుద్ధరణ పనులు తక్షణమే చేపట్టాలని, శాశ్వత పనుల అంచనాలు ఈరోజు సాయంత్రం లోపు సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఫార్మాట్ ప్రకారమే నివేదికలను సమర్పించాలన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల వారీగా దెబ్బతిన్న పంటల వివరాలు, పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ శాఖలు రోడ్లు, పాఠశాలలు, అంగన్ వాడీలు, భవనాల నష్టాలను ఖచ్చితంగా సేకరించాలని సూచించారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు