భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ ప్రధాని కావాలి : జగ్గారెడ్డి
సంగారెడ్డి, 1 నవంబర్ (హి.స.) దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు ఇందిరా గాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే, నేడు ప్రపంచ దే
జగ్గారెడ్డి


సంగారెడ్డి, 1 నవంబర్ (హి.స.)

దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు ఇందిరా గాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే, నేడు ప్రపంచ దేశాలు ప్రధాన మంత్రి మోడీని శాసిస్తున్నాయన్నారు. తెలంగాణలో 14 ఎంపీలను, ఆంధ్రప్రదేశ్ లో 20 ఎంపీలను గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని, రాహుల్ గాంధీ ప్రధాని అయితే తెలంగాణ అభివృద్ధి కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం, పోలవరం పూర్తి అవుతుందన్నారు. తెలంగాణ, ఏపీ ప్రజలు ఇప్పటి నుంచే ఆలోచన చేయాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పదేళ్లు కేసీఆర్, ఏపీలో జగన్, చంద్రబాబులు ముఖ్యమంత్రులుగా ఉండి కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇచ్చినా అక్కడి నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande