సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సుడిగాలి పర్యటన
సిద్దిపేట, 1 నవంబర్ (హి.స.) మార్కెట్ యార్డ్కు రైతులు తీసుకొచ్చిన ధాన్యం నిర్దేశిత తేమ శాతం వచ్చిన వెంటనే లోడ్ చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు ఆదేశించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలోని వరిధాన
సిద్దిపేట కలెక్టర్


సిద్దిపేట, 1 నవంబర్ (హి.స.)

మార్కెట్ యార్డ్కు రైతులు తీసుకొచ్చిన ధాన్యం నిర్దేశిత తేమ శాతం వచ్చిన వెంటనే లోడ్ చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు ఆదేశించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శనివారం సందర్శించి కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. సిబ్బంది ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం నంగునూరు మండలం ముండ్రాయి గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అదే విధంగా సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్, ఓ పి రిజిస్టర్ వెరిఫై చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande