రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్
నల్గొండ, 1 నవంబర్ (హి.స.) నిత్యం అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే, ఇటీవల మొంథా తుపాను కారణంగా కురిసిన వరుస వర్షాలకు నల్గొండ జిల్లాలోని చిట్యాల రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు వచ్చి చ
ట్రాఫిక్ జామ్


నల్గొండ, 1 నవంబర్ (హి.స.)

నిత్యం అత్యంత రద్దీగా ఉండే

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే, ఇటీవల మొంథా తుపాను కారణంగా కురిసిన వరుస వర్షాలకు నల్గొండ జిల్లాలోని చిట్యాల రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ పరిణామంతో హైదరాబాద్ నుంచి నార్కట్పల్లి వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో పెద్దకాపర్తి స్టేజ్ నుంచి చిట్యాల పట్టణం వరకు సుమారు 5 కి.మీ మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచాయి. ఈ క్రమంలోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతరం స్పాట్కు చేరుకున్న పోలీసులు వాహనాలను నెమ్మదిగా ముందుకు పంపుతూ ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande