
అమరావతి, 1 నవంబర్ (హి.స.)
: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని (Andhra Pradesh Formation Day) రాజకీయాలకు అతీతంగా జరుపుకోవాలని వైకాపా అధినేత వైయస్ జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అధికారికంగా అవతరణ దినోత్సవ వేడుకలు జరగకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా విడిచారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. అటువంటి మహనీయుడిని స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను వైయస్ జగన్ (YS Jagan) తెలియజేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాజకీయాలకు అతీతంగా జరగాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV