ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం: సుదీర్ఘ పోరాటానికి, నవ నిర్మాణానికి ప్రతీక!
అమరావతి, 1 నవంబర్ (హి.స.) నవంబర్ 1 తెలుగువారికి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులకు సువర్ణక్షరాలతో లిఖించిన రోజు. భాషా ప్రాయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిన (Andhra Pradesh Formation) రోజు. ప్రతి ఏడాది ఇదే తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర అవతరణ
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం: సుదీర్ఘ పోరాటానికి, నవ నిర్మాణానికి ప్రతీక!


అమరావతి, 1 నవంబర్ (హి.స.) నవంబర్ 1 తెలుగువారికి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులకు సువర్ణక్షరాలతో లిఖించిన రోజు. భాషా ప్రాయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిన (Andhra Pradesh Formation) రోజు. ప్రతి ఏడాది ఇదే తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. చెయ్యిత్తి జై కొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి గలవాడ అని నినదిస్తారు. అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sri Ramulu) త్యాగఫలంతో ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని పొట్టి శ్రీరాములు ఉద్యమించారు. తెలుగువారందరినీ ఏకతాటపైకి తెచ్చి సుదీర్ఘ పోరాటం చేశారు. నిద్రాహారాలు వదిలి నిరాహార దీక్షను చేపట్టిన ఆయన 1952 డిసెంబరు 15న స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేశారు. ఆయన ఆత్మార్పణం తెలుగు ప్రజల ఉద్యమానికి ఊపిరి పోసింది. 1953 అక్టోబరు 1న భాషా ప్రాయుక్త రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.

తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్ కు కర్నూలు రాజధానిగా ఉండగా తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు (Tanguturi Prakasham Panthulu) చరిత్రకెక్కారు.1956 సంవత్సరం నవంబరు 1న నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. విశాలాంధ్ర అవతరణతో తెలుగు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు. 2014 జూన్ 2న తెలుగువారు ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా ఒక్కటై జీవిస్తున్నారు. ప్రాంతాలుగా విడపోయాక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణానికి ప్రతీకగా మారుతోంద. నవ్యాంధ్రప్రదేశ్ గా అవతరిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే రూపుదిద్దుకుంటోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande