
అమరావతి, 1 నవంబర్ (హి.స.): 2025 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కరువు మండలాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా మూడు జిల్లాల్లోని మొత్తం 37 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఇవాళ నోటిఫికేషన్ జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్నమయ్య, సత్యసాయి. ప్రకాశం జిల్లాల్లోని 37 మండలాలు కరువు బారిన పడినట్లుగా తెలిపారు. మిగతా 23 జిల్లాల్లో అలాంటి పరిస్థితులు లేనట్టుగా నివేదికలు వచ్చాయని స్పష్టం చేసింది. ఈ మండలాల్లో 12 చోట్ల తీవ్రమైన, మరో 25 మండలాల్లో మధ్యస్థంగా కరువు ఉన్నట్లుగా ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, వాటిని నోటిఫై చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV