
కర్నూలు, 1 నవంబర్ (హి.స.)కర్నూలు బస్ ప్రమాదంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారంటూ 27మందిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదైనవారిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు సైతం ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, కందూరి గోపికృష్ణ, సీవీ రెడ్డి, వైసీపీ ట్విట్టర్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. కర్నూలు రూరల్ తాండ్రపాడుకు చెందిన వేణుములయ్య అనే వ్యక్తి కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా ప్రమాదానికి కల్తీ మద్యం, బెల్టుషాపులే కారణం అంటూ వీరు టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
దీంతో ప్రజలను తప్పుదారి పట్టించి అశాంతి సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నిజానికి రోడ్డుపై పడి ఉన్న బైక్ ను ఢీ కొట్టి కావేరీ ట్రావెల్స్ బస్సు వేగంగా నడపడం వల్ల ప్రమాదం జరిగింది. బైకర్ శివశంకర్ అప్పటికే డివైడర్ ను ఢీ కొట్టి పక్కనపడి చనిపోయాడు. కానీ బైక్ రోడ్డుపై ఉండటం వల్ల ప్రమాదం జరిగింది. అంతే కాకుండా శివ శంకర్ తన స్నేహితుడితో కలిసి ప్రభుత్వ లైసెన్స్ ఉన్న వైన్స్ లో మద్యంl కొనుగోలు చేసి తాగాడు. కానీ బెల్టు షాపులో మద్యం తాగాడని ప్రచారం చేయడంతో కేసు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV