
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ముంబై,01,, నవంబర్ 1:(హి.స.)body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ముంబై చత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో ఓ మహిళ నుంచి భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. కొలంబో నుండి వచ్చిన ఒక మహిళా ప్రయాణీకురాలి నుంచి దాదాపు .47 కోట్ల విలువైన 4.7 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
పూర్తి వివరాలల్లోకి వెళితే.. ఎయిర్ పోర్ట్ ఓ మహిళ నుంచి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. కాఫీ ప్యాకెట్లలో దాచిపెట్టిన తెల్లటి పొడి పదార్థం తొమ్మిది పౌచులను గుర్తించి.. వాటిని టెస్ట్ చేయగా. కోకైన్ అని తేలింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మహిళతో పాటు.. మరో నలుగురిని అరెస్ట్ చేశారు. సుమారు రూ. 47 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఐదుగురు నిందితులను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం, 1985 నిబంధనల కింద అరెస్టు చేసినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ