తొలి పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ.. ప్రకటించిన సీఎం పినరయి
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}, ఢిల్లీ, 1 నవంబర్ (హి.స.)body{font-family:Arial,sans-serif;font-s
తొలి పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ.. ప్రకటించిన సీఎం పినరయి


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}, ఢిల్లీ, 1 నవంబర్ (హి.స.)body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

కేరళ సరికొత్త చరిత్రను సృష్టించింది. దేశంలోనే తొలి పేదరికం లేని రాష్ట్రంగా అవతరించింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ప్రకటించారు. భారతదేశంలోనే పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచిందని వెల్లడించారు.

2021లో పేదరిక నిర్మూలన ప్రాజెక్ట్‌ను పినరాయి విజయన్ ప్రభుత్వ చేపట్టింది. మొట్టమొదటిగా ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రతినిధులతో రాష్ట్రమంతా సర్వే చేయించారు. దీంతో 64,006 కుటుంబాలు అత్యంత పేద కుటుంబాలుగా గుర్తింపబడ్డారు. అనంతరం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఉచితంగా నగదు రహిత చికిత్సలు చేపట్టింది. అలాగే పేదలందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించింది. అంతేకాకుండా వాళ్లందరికీ జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టింది. సామాజిక సంక్షేమానికి మద్దతుగా అనేక సహాయ సహకారాలు అందించింది. ఈ కార్యక్రమాలన్నీ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేసింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande