
రాజన్న సిరిసిల్ల, 11 నవంబర్ (హి.స.) విద్యతోనే మార్పు సాధ్యమని,
విద్యార్థినులు ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల సందర్భంగా తంగళ్లపల్లి టీఎంఆర్ఆఐఎస్ విద్యాలయం మంగళవారం ఘనంగా నిర్వహించగా, ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ..ప్రతి విద్యార్థిని నిత్యం విద్యాలయంలోని లైబ్రరీలో బుక్స్, దిన పత్రికలు చదవాలని సూచించారు. సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని, పుస్తకాలకు దగ్గరగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యతోనే వ్యక్తిగత, సామాజిక మార్పు సాధ్యమని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు