
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 12 నవంబర్ (హి.స.)ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు(Delhi Blast) ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, జమ్మూకశ్మీర్ పుల్వామాలోని పలు ప్రాంతాలలో భద్రతా సంస్థలు ఇటీవల దాడులు జరిపి భారీఎత్తున పేలుడు పదార్థాలను పట్టుకున్నాయి. దీంతో ఉగ్రవాదుల్లో ఒత్తిడి మరింత అధికమైంది. ఈ ఒత్తిడిని ఎదుర్కోలేకనే అనుమానితుడు తొందరపడి బ్లాస్టర్ చేశారని అధికారులు వెల్లడించారు.
హరియాణాలోని ఫరీదాబాద్(Faridabad)లో ఈ నెల 9, 10 తేదీల్లో అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు 3000 కిలోల పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, టైమర్లు సహా పలు బాంబు తయారీ సామగ్రినీ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. భద్రతా సంస్థలు వాటిని పట్టుకోవడానికి జరిపిన దాడుల కారణంగా భయాందోళన, నిరాశ కారణంగా పేలుడు సంభవించిందని నిఘా వర్గాలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో బాంబును పూర్తిగా తయారు చేయకుండానే పేలుడుకు పాల్పడినట్టు నిర్ధారణ అవుతోంది. అయితే.. ఈ ఘటనలో పేలుడులో వినియోగించిన పదార్థాలేవో ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. అనుమానిత మాడ్యూళ్లపై నిఘా వర్గాలు దృష్టి సారించి అరెస్ట్ చేయడం వల్ల ఓ పెద్ద పెను ప్రమాదం తప్పిందంటూ అంచనా వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ