బాలీవుడ్ నటుడు గోవిందాకు అస్వస్థత.. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలింపు!
ముంబై, 12 నవంబర్ (హి.స.) బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా (61) అస్వస్థతకు గురయ్యారు. ముంబై జుహులోని తన నివాసంలో మంగళవారం రాత్రి సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. ఈ విషయాన్ని గోవిందా స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ వెల్లడించారు. గోవిందాన
నటుడు గోవిందా


ముంబై, 12 నవంబర్ (హి.స.) బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా (61) అస్వస్థతకు గురయ్యారు. ముంబై జుహులోని తన నివాసంలో మంగళవారం రాత్రి సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. ఈ విషయాన్ని గోవిందా స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ వెల్లడించారు.

గోవిందాను ఆయన నివాసానికి సమీపంలోనే ఉన్న క్రిటికేర్ ఆస్పత్రిలో చేర్పించామని లలత్ బిందాల్ తెలిపారు. అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. చాలావరకు రక్త పరీక్షలు చేయించామని.. వాటి రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande