నేటి రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..
హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.) ఇవాళ రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం (US-India Strategic Partnership Forum) సమావేశంలో వారు పాల్గొననున్నారు. డిసెంబర్ 8,9 తేదీల్ల
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.)

ఇవాళ రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం (US-India Strategic Partnership Forum) సమావేశంలో వారు పాల్గొననున్నారు. డిసెంబర్ 8,9 తేదీల్లో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ లో ఇండో, యూఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ కు వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అయి వారిని తెలంగాణకు ఆహ్వానించనున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన అనంతరం తొలిసారి ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారా అనేది ఉత్కంఠగా మారింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande