
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 12 నవంబర్ (హి.స.)ఫరీదాబాద్‌లో భద్రతాధికారులు నిర్వహించిన ఆపరేషన్‌లో ఉగ్ర కుట్రల్లో భాగమైనవారు వైద్యులని తేలడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ టెర్రర్ మాడ్యూల్ వెనక ఉన్న ప్రధాన సూత్రధారిని అధికారులు గుర్తించారు. అతడే ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్
జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) పోలీసులు ఇర్ఫాన్‌ను అరెస్టు చేశారు. అతడి గురించి ఆరాతీయగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇర్ఫాన్‌ది జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతం. వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గతంలో అతడు శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పని చేశాడు. నౌగామ్‌లోని ఓ మసీదులో కలిసిన విద్యార్థులతో సంబంధాలు కొనసాగించాడు. పాక్‌కు చెందిన జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed)ఉగ్ర సంస్థ నుంచి ప్రేరణ పొందిన ఇర్ఫాన్.. ఫరీదాబాద్‌లోని వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసినట్లు తెలుస్తోంది. జైషేకు సంబంధించిన వీడియోలను పదేపదే విద్యార్థులకు చూపించినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ