పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. మసీదు సమీపంలో ఘటన
హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.) హైదరాబాద్ లో మంగళవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాతబస్తీ - యాకుత్ పురా రేతికి మసీదు సమీపంలోని ఓ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ షాపు నుంచి పక్కనున్న మరో షాపుకు మంటలు వ్యాపించి భారీగా ఎగసిపడ్డాయి. ద
అగ్నిప్రమాదం


హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.)

హైదరాబాద్ లో మంగళవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాతబస్తీ - యాకుత్ పురా రేతికి మసీదు సమీపంలోని ఓ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ షాపు నుంచి పక్కనున్న మరో షాపుకు మంటలు వ్యాపించి భారీగా ఎగసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సకాలంలో అక్కడికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదని, ఆస్తినష్టం అంచనా వేస్తున్నామని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande