
హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.) తెలంగాణలో గత నాలుగు రోజులుగా చలి తీవ్రత పెరిగి జన జీవనం మంచు దుప్పటి కింద ముడుచుకుంది. లంబసింగిని తలపించేలా కొన్ని జిల్లాలలో వాతావరణం 25 డిగ్రీలకు పడిపోవడంతో వేడి వాతావరణం పడిపోయి తీవ్రమైన చలి పెరిగి పల్లెల్లో మంచు దుప్పటి పరుచుకుంది. దీంతో పల్లె వాసులు ఇళ్ల నుంచి కదలక కుంపట్లు చలి మంటలకు పరిమితమయ్యారు. ఉదయం 10 గంటలైన సూర్య కాంతి జాడ లేకపోవడంతో వృద్ధులు, పిల్లలు, యువకులు చలి మంటలకే పరిమితమవుతున్నారు. మరో వైపు ఖరీఫ్ కోతలు యాసంగి పొలం పనులు ప్రారంభించిన రైతులు పొలం పనులను సక్కబెట్టేందుకు చలిని సైతం లెక్కచేయక పనులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. జనవరి వరకు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతుండగా చలి తీవ్రత తట్టుకునేందుకు వెచ్చని దుస్తులు ధరించాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు