వాటర్‌ హీటర్‌పై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఇలా చేస్తే కొత్తగా మారుతుంది!
కర్నూలు, 12 నవంబర్ (హి.స.)చలికాలం ప్రారంభమైంది. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. ఈ కాలంలో వేడి నీళ్లు కావాలంటే చాలా మంది హీటర్లను వాడుతుంటారు. నీటిని వేడి చేయడానికి గ్యాస్ గీజర్‌లు లేదా ఇమ్మర్షన్ హీటింగ్ రాడ్లను ఉపయోగిస్తారు. ఇమ్మర్షన్ రాడ్ ధర
వాటర్‌ హీటర్‌పై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఇలా చేస్తే కొత్తగా మారుతుంది!


కర్నూలు, 12 నవంబర్ (హి.స.)చలికాలం ప్రారంభమైంది. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. ఈ కాలంలో వేడి నీళ్లు కావాలంటే చాలా మంది హీటర్లను వాడుతుంటారు. నీటిని వేడి చేయడానికి గ్యాస్ గీజర్‌లు లేదా ఇమ్మర్షన్ హీటింగ్ రాడ్లను ఉపయోగిస్తారు. ఇమ్మర్షన్ రాడ్ ధర చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, అత్యధిక శాతం ప్రజలు దీనినే ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ రాడ్‌ను పదేపదే ఉపయోగించడం వల్ల దానిపై తెల్లటి పొర లాంటిది పేరుకుపోతుంటుంది.

అయితే ఈ తెల్లటి పొర నీటిలో ఉండే ఖనిజాలు కారణంగా ఏర్పడుతుందని చెబుతున్నారు టెక్‌ నిపుణులు. నీటిలో సహజంగా ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, రాడ్ నీటిని వేడి చేసినప్పుడు ఆ రాడ్‌పై గట్టిగా అతుక్కుపోయి తెల్లటి పొరగా ఏర్పడుతుంది. ఈ పొర రాడ్ ఉత్పత్తి చేసే వేడిని నీటి వరకు చేరకుండా అడ్డుకుంటుంది. దీని ఫలితంగా నీరు వేడెక్కడానికి రాడ్‌కు సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల విద్యుత్‌ బిల్లు కూడా పెరిగిపోతుంటుంది. కరెంటు బిల్లును ఆదా చేసుకోవాలంటే హీటర్‌ రాడ్‌పై ఉన్న తెల్లటి పొరను తొలగించడం చాలా ముఖ్యం. దీనిని సులభంగా శుభ్రం చేయడానికి కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

కిరోసిన్ నూనె: ఈ తెల్లటిపొరను తొలగించాలంటే ముందుగా రాడ్‌ను పూర్తిగా చల్లగా ఉండాలి. తెల్లటి పొరపై కిరోసిన్ నూనెను బాగా రాయండి. కొన్ని నిమిషాల పాటు అలాగే వదిలేయండి. కిరోసిన్ నూనె ఆ గట్టి పొరను మెత్తబరుస్తుంది. ఆ తర్వాత ఆ రాడ్‌పై తడిగుడ్డతో రుద్దితే తెల్లటి పొర పొడిపొడిగా రాలిపోతుంది. కిరోసిన్ నూనె సహాయంతో ఆ తెల్లటి పొర సులభంగా తొలగిపోతుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం: 2 లీటర్ల నీటిలో 5-6 చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేయండి. ఈ ద్రావణంలో హీటింగ్ రాడ్‌ను కొంతసేపు ముంచి ఉంచండి. ఈ ద్రావణం తెల్లటి పట్టీని తొలగించడంలో సహాయపడుతుంది. తర్వాత నీటితో కడగండి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande