ఇంటిగ్రేటెడ్‌ మెయిన్‌ పారాచూట్‌ ఎయిర్‌డ్రాప్‌ టెస్ట్‌ పూర్తి
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
ISRO


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

తిరుపతి:/ఢిల్లీ 12 నవంబర్ (హి.స.) మానవ సహిత అంతరిక్ష ప్రయోగం దిశగా ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. గగన్‌యాన్‌ సన్నాహక పరీక్షల్లో భాగంగా ఈ నెల 3న నిర్వహించిన.. ఇంటిగ్రేటెడ్‌ మెయిన్‌ పారాచూట్‌ ఎయిర్‌డ్రాప్‌ టెస్ట్‌ (ఐఎంఏటీ) విజయవంతమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఝాన్సీలోని బబీనా ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ (బీఎప్‌ఎఫ్‌ఆర్‌)లో ఈ పరీక్షలను నిర్వహించినట్లు ఇస్రో మంగళవారం ఓ వీడియో విడుదల చేసింది. ఐఎంఏటీలో భాగంగా తొలుత వైమానిక దళానికి చెందిన ఐఎల్‌-76 విమానం నుంచి క్రూ మాడ్యూల్‌ బరువుకు సమానమైన ఆరు టన్నుల పేలోడ్‌ను 2.5 కి.మీ. ఎత్తు నుంచి జారవిడిచారు. పారాచూట్‌ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంతో పేలోడ్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయింది. విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ), డీఆర్డీవోకు చెందిన ఏరియల్‌ డెలివరీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఆర్డీఈ), ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ క్రియాశీలకంగా వ్యవహరించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande