
అమరావతి, 12 నవంబర్ (హి.స.)
):మదనపల్లిలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టయింది. మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీల మార్పిడి గోల్‌మాల్ అయింది. కిడ్నీ ఇచ్చిన మహిళ యమున మృతిచెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి భర్త సూరిబాబు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఆస్పత్రిపై తనిఖీలు చేశారు మదనపల్లి పోలీసులు. ఈ కేసులో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ