ఎర్రకోట వద్ద రెక్కీ.. రిపబ్లిక్‌ డే టార్గెట్‌:
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
Blast


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 12 నవంబర్ (హి.స.) దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట (Red Fort Blast) వద్ద రెక్కీ చేసినట్లు సమాచారం. అంతేగాక, వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకొని భారీ దాడికి పాల్పడాలని వీరు ప్లాన్‌ చేసినట్లు దర్యాప్తు వర్గాల సమాచారం.

ఎర్రకోట వద్ద పేలుడు (Delhi Blast) చోటుచేసుకున్న కారును నడిపిన వ్యక్తిని జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్‌ ఉమర్‌ నబీగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అతడి సన్నిహితుడు, ఫరీదాబాద్‌కు చెందిన ముజమ్మిల్‌ షకీల్‌ను కూడా కీలక నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడిని విచారించగా.. కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్‌తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించామని ముజమ్మిల్‌ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. దీపావళి రోజున రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలని ప్లాన్‌ చేసినా.. ఆ తర్వాత దాన్ని విరమించుకున్నట్లు అతడు విచారణలో చెప్పాడని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకోవాలని వీరు కుట్ర పన్నినట్లు తెలిపాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande