మెదక్ జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. సరైన పత్రాలు లేని 67 వాహనాల సీజ్
మెదక్, 12 నవంబర్ (హి.స.) మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారు జామున డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 67 వాహనాలు సీజ్ చేసినట్లు
కార్డెన్ సెర్చ్


మెదక్, 12 నవంబర్ (హి.స.)

మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం

ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారు జామున డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 67 వాహనాలు సీజ్ చేసినట్లు వారు తెలిపారు. అనంతరం డి.ఎస్.పి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, కావలసిన అన్ని పేపర్లు ఉండాలని సూచించారు. బయట రాష్ట్రాల వాళ్ళకి ఇండ్లు రెంట్ ఇచ్చే ఇంటి యజమానులు తప్పకుండా వారి ఆధార్ కార్డులు ఉంచుకోవాలని అన్నారు. సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో 10 మంది ఎస్ఐలు 90 మంది కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande