
హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.)
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ
అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసిన అధికారులు వారి నుంచి రూ. 1.4 కోట్లు విలువచేసే డ్రోన్లతో పాటు ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి అరైవల్ ఫోర్కోర్ట్ ప్రాంతంలో ఇద్దరు అంతర్జాతీయ ప్రయాణికులను తనిఖీచేయగా వారి వద్ద సుమారు 1.4 కోట్ల విలువైన డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల (ఐ ఫోన్స్) ను హైదరాబాదు ఏఎస్జీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు