
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 12 నవంబర్ (హి.స.)దిల్లీలో పేలుడుతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు 10 కి.మీ. పరిధిలో ఉండొద్దని యూకే తన పౌరులను హెచ్చరించింది (India-Pakistan border). అలాగే జమ్మూకశ్మీర్‌లో కొన్ని ప్రాంతాల్లో పర్యటించొద్దని సూచించింది. అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన శ్రీనగర్, పహల్గామ్, గుల్‌మార్గ్, సోన్‌మార్గ్‌లో పర్యటించేటప్పుడు స్థానిక అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని అప్రమత్తం చేసింది. జమ్మూ నుంచి మాత్రం విమానంలో రాకపోకలు చేయొచ్చని పేర్కొంది. అటారీ-వాఘా సరిహద్దు (Wagah Border) మూసివేసి ఉందని, అక్కడికి వెళ్లొద్దని సూచించింది. ఈ అడ్వైజరీకి విరుద్ధంగా వ్యవహరిస్తే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా పనిచేయకపోవచ్చని హెచ్చరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ