
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 12 నవంబర్ (హి.స.)
ఫరీదాబాద్ (Faridabad) ఉగ్ర కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహిన్ (Dr Shaheen)ను అధికారులు విచారించగా.. కీలక విషయాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులు జరిపేందుకు దాదాపు రెండేళ్ల నుంచి సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె తెలిపింది. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్ర సంస్థ కోసం ఇది చేయాలనుకున్నట్లు వెల్లడించింది.
ఫరీదాబాద్ మాడ్యూల్ (Terror module)తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణతో డాక్టర్ షాహిన్‌ను అరెస్టు చేసిన అధికారులు తదుపరి విచారణ కోసం శ్రీనగర్ తీసుకెళ్లారు. విచారణ సమయంలో ఆమె నుంచి అధికారులు కీలక విషయాలు రాబట్టారు. దేశంలో బహుళ ఉగ్ర దాడులు చేయడం గురించి ఉమర్ ప్రతిసారీ ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని షాహిన్ తెలిపినట్లు తెలుస్తోంది. డాక్టర్ ముజమ్మిల్, ఆదిల్‌తో కలిసి దాదాపు రెండేళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్లు అంగీకరించినట్లు సమాచారం. వీటిని ఉపయోగించి పాక్‌కు చెందిన జైషే ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు సన్నాహాలు చేసినట్లు బయటపెట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ