నిర్దేశించిన తేమ శాతం కలిగిన ధాన్యంను వెంటనే తూకం చేసి మిల్లుకు తరలించాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, 12 నవంబర్ (హి.స.) నిర్దేశించిన తేమ శాతం కలిగిన ధాన్యంను వెంటనే తూకం చేసి కేటాయించిన మిల్లుకు తరలించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వరి కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం ఉదయం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వ
కలెక్టర్ ఆదర్శ్ సురభి


వనపర్తి, 12 నవంబర్ (హి.స.) నిర్దేశించిన తేమ శాతం కలిగిన

ధాన్యంను వెంటనే తూకం చేసి కేటాయించిన మిల్లుకు తరలించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వరి కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం ఉదయం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి మండల,పెద్దగూడెం తండా పరిధిలో ఏర్పాటుచేసిన ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రైతులు ఆర పోసుకున్న వరి ధాన్యం తేమ శాతం, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు నిబంధనల ప్రకారమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. కాలిపర్స్ను వినియోగించడం ద్వారా సన్నరకం, దొడ్డురకం వరి ధాన్యాన్ని సూచించారు. వరి కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం సన్న రకం వడ్లకు సంబంధించిన బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తామని కలెక్టర్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande