
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}ఢిల్లీ 12 నవంబర్ (హి.స.)
ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్.. ఎర్రకోట పేలుడు ఘటన (Red Fort blast)తో ఇప్పుడు దర్యాప్తు ఏజెన్సీల దృష్టి ‘అల్ - ఫలాహ్’ యూనివర్సిటీపై పడింది. వైద్యులు, టీచర్ల ముసుగులో ఈ విశ్వవిద్యాలయాన్ని కొందరు తమ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నారు. ఒకప్పుడు ప్రతిష్ఠాత్మక జామియా, అలీగఢ్ విశ్వవిద్యాలయాలకు ప్రత్యామ్నాయంగా కన్పించిన ‘అల్-ఫలాహ్ (Al Falah University)’.. ఇప్పుడు ఉగ్ర కుట్రలకు కేంద్రంగా వార్తల్లో నిలవడంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల్లో గుబులు పట్టుకుంది.
ఇంజినీరింగ్ కాలేజీగా మొదలై..
హరియాణా (Haryana)లోని ఫరీదాబాద్ జిల్లా ధౌజ్ గ్రామంలో 76 ఎకరాల్లో అల్-ఫలాహ్ యూనివర్సిటీ విస్తరించి ఉంది. హరియాణా ప్రైవేటు యూనివర్సిటీల చట్టం కింద దీన్ని ఏర్పాటుచేశారు. 1997లో ఇంజినీరింగ్ కాలేజీగా మొదలైంది. 2013లో యూజీసీకి చెందిన నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్) నుంచి ‘ఏ’ గ్రేడ్ అందుకుంది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి యూనివర్సిటీ హోదా కల్పించింది. ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ