
ఢిల్లీ , 12 నవంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీ వాతావరణ కాలుష్యం మరింతగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో మొత్తం వాయు నాణ్యత సూచీ (AQI) 413 గా నమోదైంది. ఇది ‘తీవ్ర’ (Severe) వర్గంలోకి వస్తుంది. గాలి నాణ్యత తీవ్రంగా దిగజారడంతో, ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) ఇప్పటికే GRAP-III దశ పరిమితులను అమల్లోకి తీసుకువచ్చింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని చాలా మానిటరింగ్ స్టేషన్లు సూచించిన గాలి కాలుష్య స్థాయిలు అత్యధికంగా నమోదు అయ్యాయి. దేశ రాజధానిలోని చాలా ప్రాంతాల్లో AQI 400 దాటింది.
వజీర్‌పూర్ కేంద్రం అత్యధికంగా 459 AQIను నమోదు చేసింది. మొత్తం ఢిల్లీలో దాదాపు అన్ని కేంద్రాల్లో ‘తీవ్ర’ గాలి నాణ్యతే నమోదైంది. అలిపూర్ 431, ఆనంద్ విహార్ 438, అశోక్ విహార్ 439, అయా నగర్ 405, బవానా 451, బురారి క్రాసింగ్ 439, చాంద్ని చౌక్ 449, జహాంగీర్‌పుర్ 446, ముండ్కా 442, రోహిణి 442 వంటి అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత AQI 400కు పైగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం AQI కొంత తక్కువగా ఉన్నప్పటికీ అవి కూడా ‘చాలా మందగమైన’ (Very Poor) వర్గంలోనే ఉన్నాయి. కాగా, ఢిల్లీలో వాయు కాలుష్యంయ కారణంగా 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV