తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి భారీగా సమయం
తిరుమల, 12 నవంబర్ (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం టో
తిరుమల


తిరుమల, 12 నవంబర్ (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 15 గంటల సమయం పడుతుందని, రూ.300 శీఘ్రదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.

మంగళవారం (నవంబర్ 11) స్వామివారిని 67,367 మంది భక్తులు దర్శించుకోగా.. 22,369 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు రూ.4.30 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande