వైసీపీ ర్యాలీ.. పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయి ప్రవర్తించారు. పోలీసులతో మరోసారి దురుసుగా ప్రవర్తించారు.
ex-minister-ambati-rambabu-dispute-with-police-over-ysrcp-rally-493382


గుంటూరు, 12 నవంబర్ (హి.స.)

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. నేడు 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయాలని వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నియోజకవర్గాల్లో కీలక నేతల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరిట ర్యాలీలు నిర్వహించారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.

స్వామి థియేటర్ వద్ద ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకోగా.. అంబటి రాంబాబు.. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుతో వాగ్వాదానికి దిగారు. ఒకరికొకరు వేళ్లు చూపించుకుంటూ దుర్భాలాడినట్లు సమాచారం. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande