‘నో డ్రోన్ జోన్’ ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో డ్రోన్స్ నిషేధం
విశాఖపట్నం, 12 నవంబర్ (హి.స.) ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ సందర్భంగా విశాఖ సిటీ పోలీస్ భారీ భద్రతను ఏర్పాట్లు చేస్తోంది. భద్రతా చర్యలలో భాగంగా విశాఖ సిటీ పోలీసులు డ్రోన్‌ల వినియోగంపై కఠిన నిబంధనలు
ఆంధ్రా యూనివర్సిటీ


విశాఖపట్నం, 12 నవంబర్ (హి.స.)

ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ సందర్భంగా విశాఖ సిటీ పోలీస్ భారీ భద్రతను ఏర్పాట్లు చేస్తోంది. భద్రతా చర్యలలో భాగంగా విశాఖ సిటీ పోలీసులు డ్రోన్‌ల వినియోగంపై కఠిన నిబంధనలు విధించారు. కన్వెంట్ జంక్షన్ నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌లు ఎగరవేయడం లేదా ఆపరేట్ చేయడం నిషేధించారు. ఈ నిషేధం 2025 నవంబర్ 12న ఉదయం 6 గంటల నుంచి 2025 నవంబర్ 16 వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుంది. డ్రోన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై Aircraft Act, 1934 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ తాజాగా ఒక ప్రకటనలో హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande